వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా నిర్మలా సీతారామన్ ను ఆమె ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారు? దేశం కోసమా? అని ప్రశ్నించారు. దేశం అంటే మట్టి మాత్రమే కాదు అని ఆమె పేర్కొన్నారు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏంటని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తి లేకుండా సూటిగా సమాధానం చెప్పాలని నిర్మలా సీతారామన్ ను ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Home News