మేడారంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ పర్యటన

మేడారంలో ఆర్టీసీ ఎండి సజ్జనార్ పర్యటనవరంగల్ టైమ్స్ , ములుగు జిల్లా : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలను పరిశీలించేందుకు టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ములుగు జిల్లాలో పర్యటించారు. ముందుగా ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ సజ్జనార్ కు పుష్ప గుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ నెల 16 నుంచి 19 వరకు జరుగనున్న మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కోట్లాది మంది భక్తులు తరలిరానుండటంతో కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పక్కా ఏర్పాట్లు చేశారు.