హైదరాబాద్: వైవిధ్యమైన సినిమాలు తో యంగ్ హీరో నిఖిల్ తనకంటూ ఓ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. నిఖిల్ ఎంచుకునే కథ, కథనాలే కాదు వాటిల్లో పాత్రలు కూడా చాలా వైవైద్యం గా ఉంటాయి. ఇక నిఖిల్ – డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కార్తికేయ కి ఇటీవలే సీక్వెల్ పనులు మొదలు అయ్యాయి.కార్తికేయ 2 టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో నిఖిల్ డాక్టర్ గా నటిస్తున్నాడు. కార్తికేయ లో మెడికల్ స్టూడెంట్ గా నటించిన నిఖిల్ ఇప్పుడు ఈ సీక్వెల్ లో డాక్టర్ గా కనిపిస్తున్నాడు. ఇదే విషయాన్ని చెప్పకనే చెప్పేసారు కార్తికేయ 2 చిత్ర బృందం. నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా కార్తికేయ 2 చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ లుక్ లో నిఖిల్ మేడలో స్టేథస్ స్కోప్ ఉంది. అలానే వైద్యో నారాయణో హరి – వైద్యుడే నారాయణుడు – నారాయణుడే వైద్యుడు అని ఒక శ్లోకాన్ని దాని అర్థాన్ని కూడా ఈ పోస్టర్ లో పెట్టారు..! ఐతే ఇదే పోస్టర్ తో కరోనా తో యుద్ధం చేస్తున్న వైద్యులు కు కూడా కృతజ్ఞతలు తెలిపారు డైరెక్టర్ చందు మొండేటి మరియు చిత్ర బృందం