మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరేస్తాం: రావు పద్మ

వరంగల్ అర్బన్: రానున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఎన్నికలలో కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగురవేయడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేస్తున్న కార్యక్రమాలు, విపత్కర పరిస్థితుల్లో తీసుకుంటున్న దిశా నిర్ధేశాలు, అభివృద్ధి పనులే యువతను కమలం వైపు అడుగులు వేయిస్తున్నాయని రావు పద్మ తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరేస్తాం: రావు పద్మగ్రేటర్ వరంగల్ 8వ డివిజన్ నుంచి జిల్లా యూత్ నాయకులు సిద్ధం నరేష్ ఆధ్వర్యంలో 25 మంది, 27వ డివిజన్ నుంచి బెంబిరి నగేష్ ఆధ్వర్యంలో 30 మంది, 54వ డివిజన్ నుంచి డివిజన్ ప్రెసిడెంట్ వెన్నపురెడ్డి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ పోరిక రాజు, సుమన్ , గణపతితో పాటు 30 మంది యువకులు రావు పద్మ సమక్షంలో బీజేపీలో చేరారు. వరంగల్ అర్బన్ జిల్లా హంటర్ రోడ్డులోని బీజేపీ కార్యాలయంలో రావు పద్మ యువకులను స్వాగతించి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశరాజకీయాల్లో యువత పాత్ర కీలకమని దేశప్రధాని మోదీ చెప్పే మాటలు, సాధారణ సమయంలోనే కాకుండా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా దేశానికి దిశానిర్ధేశం చేస్తూ ప్రజలను కాపాడుకుంటున్న మోదీ నిర్ణయాలు యువతను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని రావు పద్మ అన్నారు. మోదీ పాలనకు ఆకర్షితులయ్యే యువత బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కొలను సంతోష్ రెడ్డి, సంగాని జగదీశ్వర్, మందాటి వినోద్, జన్ను మధు, పాశికంటి రాజేంద్ర ప్రసాద్, కందగట్ల సత్యనారాయణ, సిద్ధం నరేష్, నాను నాయక్,కిషన్ సింగ్, కమల్, ఆకాష్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.