హజరత్ కమల్ పాషా త్వరగా కోలుకోవాలి: దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా: అనారోగ్యంతో బాధపడుతూ మాక్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట-దర్గా మత పెద్ద హజరత్ కమల్ పాషాను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. హజరత్ కమల్ పాషా త్వరగా కోలుకోవాలి: దాస్యంహజరత్ కమల్ పాషా దర్గా హజ్రత్ సయ్యద్ షా అఫ్జల్ బియాబాని రక్తసంబంధికుడు. అలాంటి కుటుంబ నేపథ్యం వున్న హజరత్ కమల్ పాషాను ఇలాంటి పరిస్థితుల్లో చూడటం చాలా బాధాకరమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. కమల్ పాషా త్వరితగతిన కోలుకుని ఆయురోగ్యాలతో వుండాలని దర్గా అఫ్జల్ బియాబానిని ప్రార్ధించినట్లు తెలిపారు. కమల్ పాషాను పరామర్శించిన వారిలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు గ్రేటర్ వరంగల్ నగర డిప్యూటి మేయర్ సిరాజుద్ధీన్ కూడా వున్నారు.