లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు సి.పి. రవిందర్ ఆర్థిక సాయం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ : మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయంతో నూతన జీవితాన్ని ప్రారంభించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ కోరారు. గత మార్చి 21న మావోయిస్టు దంపతులు గండ్రకోటి మల్లేశం అలియాస్ కిరణ్, చింత శ్రీలత అలియాస్ హైమాలు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవిందర్ ఎదుట లొంగిపోయారు.లొంగిపోయిన మావోయిస్టు దంపతులకు సి.పి. రవిందర్ ఆర్థిక సాయం2004 నుంచి వివిధ హోదాల్లో ఛత్తీష్ ఘడ్ , ఒడిషా, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ ప్రాంతాల్లో పనిచేసి పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో పాటు, ప్రజల్లో పార్టీ పట్ల సానుభూతి తగ్గడంతో పార్టీ వీడిన వీరిద్దరు జనజీవన స్రవంతిలో కలిసారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అందించే చేయూతలో భాగంగా నేడు వరంగల్ పోలీస్ కమిషనర్ గండ్రకోటి మల్లేశంకు రూ.5లక్షలు, చింత శ్రీలతకు రూ. 4లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమములో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఓఎస్డీ తిరుపతి, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ రవికిరణ్ పాల్గొన్నారు.