ఓయూ పరిధిలో వాయిదా పడిన పరీక్షలు

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 8 నుంచి 16 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాయిదా పడిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.