వరంగల్ టైమ్స్,హైదరాబాద్: ముచ్చింతల్ ఆశ్రమంలో కొనసాగుతున్న రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు మంగళవారం కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ముచ్చింతల్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. టికెట్ కౌంటర్ ప్రారంభిస్తారు. రాత్రి 8 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్తారు.
Home News
Latest Updates
