తెలంగాణపై అమిత్ షా ఫోకస్ 

తెలంగాణపై అమిత్ షా ఫోకస్

తెలంగాణపై అమిత్ షా ఫోకస్ 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ పావులు వేగంగా కదుపుతోంది. త్వరలోనే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేసేందుకు సైతం అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అందుకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించే పనిలో జేపీ నడ్డా ఉన్నారట. అంతేకాదు ఇక తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన రిపోర్టును స్వయంగా అమిత్ షానే చూసుకుంటారని టాక్. తెలంగాణ పాలిటిక్స్ ను తానే ఫాలో అవుతానని అమిత్ షా.. పార్టీ శ్రేణులకు గట్టిగానే చెప్పినట్లు సమాచారం.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, లక్ష్మణ్, ఈటెల రాజేందర్, డీకే అరుణ లాంటి వారిని ఇప్పటికే అమిత్ షా పిలిచి మాట్లాడినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కొన్ని మార్పులు, చేర్పులకు తెలంగాణ బీజేపీ నేతలు సిద్ధంగా ఉండాలని అమిత్ షా చెప్పినట్లు టాక్. అవసరమైతే కొందరిని తప్పించి, మరికొందరికి ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. అందుకోసం సిద్ధంగా ఉండాలని తెలంగాణ బీజేపీ లీడర్లకు అమిత్ షా గట్టిగానే చెప్పినట్లు సమాచారం. పార్టీనే ముఖ్యమని, పదవులు ముఖ్యం కాదన్న విషయాన్ని గ్రహించాలని అమిత్ షా చెప్పినట్లు ఊహానాగాలు వస్తున్నాయి.తెలంగాణపై అమిత్ షా ఫోకస్ ఇక మార్పులు, చేర్పులతో పాటు తాను స్వయంగా తెలంగాణలో పర్యటించేందుకు అమిత్ షా ఆసక్తిగా ఉన్నారట. ఇప్పట్నుంచి ప్రతీ నెలా రెండురోజుల పాటు తెలంగాణలో అమిత్ షా పర్యటిస్తారని టాక్. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో నేతలతో వరుస భేటీలతో పాటు అవసరమైతే తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లోనూ ఆయన పర్యటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈనెల ఆఖర్లో అమిత్ షా ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అమిత్ షా సమక్షంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. అమిత్ షా సమక్షంలో పొంగులేటి చేరితే బీజేపీకి కూడా అడ్వాంటేజ్ ఉంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా భావిస్తున్నారట. అయితే అమిత్ షా టూర్ కచ్చితంగా ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఉన్నా, లేకపోయినా అమిత్ షా ఎప్పుడు రాష్ట్రానికి వస్తే అప్పుడే పొంగులేటి చేరవచ్చని సమాచారం.

ఇలా తెలంగాణ బీజేపీ పాలిటిక్స్ ఇప్పుడు అమిత్ షా చుట్టే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇక స్టేట్ బీజేపీలో అమిత్ షా ప్రమేయం కచ్చితంగా పెరగవచ్చని రాష్ట్ర బీజేపీ నేతలు కూడా చెప్పుకుంటున్నారు. బీజేపీ బలోపేతానికి గట్టి ప్లానులు వేసే సమర్థత ఉన్న అమిత్ షా తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తే.. రాష్ట్రంలో తమకు తిరుగుండదని కమలనాథులు కూడా భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆయన తెలంగాణపై ఫోకస్ చేయాలని వారు బలంగానే కోరుకుంటున్నారట. నిజంగానే ఆయన తెలంగాణపై ఫోకస్ చేస్తే బీజేపీకి రాష్ట్రంలో బాగానే లాభం జరిగే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే తెలంగాణ పాలిటిక్స్ పై దృష్టి కేంద్రీకరించేంత తీరిక అమిత్ షాకు ఉంటుందా లేదా అన్నది చూడాలి.