వరంగల్ టైమ్స్, శ్రీకాకుళం జిల్లా: ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం కృష్ణదాసు స్వామివారిని దర్శించారు. ఉదయం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. కాగా అధికారులు మాత్రం వీఐపీల సేవలలో తరిస్తున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు దేవాలయం వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులను ఆలయం నుంచి బయటకు నెట్టేశారు. దీంతో జర్నలిస్టులు ఆలయం బయట నిరసనకు దిగారు.