ఫిబ్రవరి 6 నుండి బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు దంత కళాశాలల్లో కన్వీనర్ కోటా బీడీఎస్ ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ను కాళోజి వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. ఫిబ్రవరి 6న ఉదయం 8 గంటల నుండి 8 సాయింత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని పేర్కొంది. అభ్యర్థులు ఒకే సారి అన్ని కాలేజీలకు ప్రాధాన్యతాక్రమంలో ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విడతతో పాటు మిగిలిన విడత కౌన్సిలింగ్ లకు ఈ ఆప్షన్ల ఆధారంగానే సీటు కేటాయింపులు జరుగుతాయని వెల్లడించారు. కావున అభ్యర్థులు ఇది గమనించి అన్ని కాలేజీలకు ప్రాధాన్యతాక్రమంలో తప్పని సరిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https:/tsbdsadm.tsche.in,www.knruhs.telangana.gov.in లో చూడవచ్చని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు.