సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం: మోడీ

సమతామూర్తి విగ్రహం జాతికి అంకితం: మోడీవరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శంషాబాద్ సమీపంలోని ముచ్చింత్‌లో గల రామానుజ సమతామూర్తి విగ్రహాన్నిప్రధాని మోడీ ఆవిష్కరించారు. రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సమతామూర్తి కేంద్రంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు చేశారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. రాత్రి 8 గంటలకు రామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకల్లో మోడీ పాల్గొననున్నారు. రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు ప్రయాణం అవుతారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్, తదితరులు పాల్గొన్నారు.