రాజ్యాంగాన్ని మార్చాల్సిందే.. తప్పేముంది: కేసీఆర్

రాజ్యాంగాన్ని మార్చాల్సిందే.. తప్పేముంది: కేసీఆర్వరంగల్ టైమ్స్,హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులుచెరిగారు. దేశంలో దళితుల అభ్యున్నతి కోసం రాజ్యాంగం మార్చాలన్నాం తప్పా అంటూ కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ బీజేపీ విధానంపై ధ్వజమెత్తారు. దేశంలో దళితుల జనాభా 19 శాతం పెరిగింది. పెరిగిన దళితుల జనాభా ప్రకారం రాజ్యాంగంలో 19 శాతం రిజర్వేషన్లు పెరగాలి.. దీని కోసం కొత్త రాజ్యాంగం కావాలి తప్పా.. మహిళల జనాభా పెరిగింది. పెరిగిన మహిళా జనాభా ప్రకారం రాజ్యాంగంలో మార్పు చేయాలన్నాం తప్పా.. బీసీలకు న్యాయం జరగడానికి రాజ్యాంగంలో మార్పు చేయాలన్నాం తప్పాం.. అసలు రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ చెప్పాడు.

రాజ్యాంగం అమలు చేసే వారు సరైన రీతిలో అమలు చేయకపోయినా, ప్రజల ఉన్నతి కోసం రాజ్యాంగంలో మార్పులు చేసుకోవాల్సి టైం వస్తే రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చని ఆనాడే చెప్పారని కేసీఆర్ గుర్తు చేశారు. అలాంటిది ఈ బీజేపోళ్లకు ఎందుకు బాధైతుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. దీన్ని కొందరు రాజకీయం చేస్తూ నన్ను విమర్శించడం సిగ్గుచేటని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవన్నీ జరగాలంటే, అన్ని వర్గాల ప్రజల్లో అభ్యున్నతి కనిపించాలంటే రాజ్యాంగంలో మార్పులు చేయడం అనేది అసలు తప్పేకాదని, అది జరగాల్సిందేనని మరో సారి సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. అలా జరిగినప్పుడే పెరిగిన జనాభా ప్రకారం ప్రజలకు న్యాయం జరుగుతుందని సీఎం కేసీఆర్ మరోసారి ప్రకటించారు.