నర్సింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ

నర్సింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీ

15 మంది విద్యార్థులకు గాయాలు..!

నర్సింగ్ కాలేజీ బస్సును ఢీకొట్టిన లారీవరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : నల్గొండ జిల్లా నకిరేకల్ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. కాలేజీ విద్యార్థులు ప్ర‌యాణిస్తున్న‌ బస్సును ఓ లారీ వెనుక నుండి వ‌చ్చి ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది విద్యార్థులకు తీవ్ర గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను అంబులెన్స్ లో నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించారు. కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో అక్కడి నుండి సూర్యాపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు త‌ర‌లించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా సూర్యాపేటకు చెందిన అపర్ణ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులుగా తెలుస్తోంది.