మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం 

మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల కేసీఆర్ సంతాపం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హీరాబెన్ మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ సంతాపం తెలిపారు.

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత రెండ్రోజులుగా ఆరోగ్యం విషయమించి శుక్రవారం ఉదయం 3.39 గంటలకు కన్నుమూసిన విషయం తెలిసిందే.