ముగిసిన మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు
వరంగల్ టైమ్స్, అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మాతృమూర్తి చితికి మోదీ నిప్పంటించారు. చివరిసారిగా చేతులు జోడించి అంతిమ నివాళులర్పించారు. సోదరుడు, కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లికి వీడ్కోలు పలికారు.
అంతిమయాత్రలో భాగంగా ప్రధాని మోడీ తన తల్లి పాడె మోశారు. వాహనంలో తల్లి పక్కనే కూర్చున్నారు. గాంధీనగర్ లోని సెక్టార్ 30 స్మశాన వాటికలో జరిగిన అంతిమక్రియల్లో మోడీ కుటుంబసభ్యులతో పాటు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.