యాదాద్రి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 

యాదాద్రి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

వరంగల్ టైమ్స్, యాదాద్రి జిల్లా : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలు పుష్పగుచ్ఛాలతో ఆహ్వానం పలికారు. ఆలయం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.యాదాద్రి సన్నిధిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనంతరం గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీనరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం రాష్ట్రపతి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందించగా, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందించారు.

తర్వాత యాదాద్రి ప్రధాన ఆలయ పరిసరాలను ద్రౌపది ముర్ము పరిశీలించారు. అద్దాల మండపం, ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నారు. కాగా, యాదగిరిగుట్టను సందర్శించిన 5వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.