టీ20 ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ గా సూర్య, స్మృతి
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ టీ20 ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు పురుషుల విభాగంలో సూర్యకుమార్ యాదవ్, మహిళల విభాగంలో స్మృతి మందన పేర్లను ప్రతిపాదించారు. సూర్యకుమార్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజాలతో పోటీపడుతుండగా, మందన పాకిస్థాన్ ఆల్ రౌండర్ నిదా డార్, న్యూజిలాండ్ కు చెందిన సోఫీ డివైన్, ఆస్ట్రేలియాకు చెందిన తహిల మెక్ గ్రాత్ లతో పోటీపడుతుంది.