ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు 

ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు

ముగిసిన కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో కైకాల సత్యనారాయణకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు ఫిల్మ్ నగర్ లోని ఆయన నివాసం నుంచి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. కైకాలకు తుది వీడ్కోలు పలికేందుకు పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివచ్చారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూసిన విసయం తెలిసిందే.