యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య 

యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : ప్రముఖ టీవీ సీరియల్ నటి తునీషా శర్మ (20) శనివారం ఆత్మహత్య చేసుకున్నది. టీవీ సీరియల్ సెట్ లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తునీషా శర్మ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తునీషా మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. యువ నటి తునీషా శర్మ ఆత్మహత్య యువ నటి ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం అలుముకున్నది. తునీషా శర్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీరియల్ లో మొదటిసారి నటించింది. ప్రస్తుతం సోనీ సబ్ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’ లో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సీరియల్ లో షహజాది మరియమ్ పాత్రలో నటిస్తున్నది.

ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2 : దుర్గా రాణి సింగ్, దబాంగ్ -3 చిత్రాలలో కూడా కనిపించింది. ఫితూర్, బార్ బార్ దేఖోలో, తునీషా కత్రినా కైఫ్ .. టీనేజ్ పాత్రను పోషించింది. ‘ఇంటర్నెట్ వాలా లవ్’ సీరియల్ లో తునీషా పాత్ర బాగా అందరినీ అలరించింది.