పీవీ పేరుతో త్వరలో పోస్టల్ స్టాంప్: కిషన్ రెడ్డి

పీవీ పేరుతో త్వరలో పోస్టల్ స్టాంప్: కిషన్ రెడ్డి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్: దేశం గర్వించదగ్గ ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావును గౌరవించుకోనే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి. మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం తపాలా స్టాంపులకు కేంద్రం అనుమతినిచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పీవీ పేరుతో త్వరలో పోస్టల్ స్టాంప్: కిషన్ రెడ్డిఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆయన భూసంస్కరణల అమలుకు చొరవ తీసుకున్న గొప్ప నేత పీవీ అన్న కిషన్ రెడ్డి.. ప్రపంచ దేశాలతో పోటీపడే స్థాయికి భారతదేశాన్ని తీర్చిదిద్దిన ప్రధానిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోతారని కిషన్ రెడ్డి కొనియాడారు. ఆయనను స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయమన్న ఆయన.. పీవీ స్టాంప్‌ను భారత ప్రభుత్వ పోస్టల్ శాఖ త్వరలో విడుదల చేస్తుందని స్పష్టం చేశారు.