క‌త్తి‌కి కరోనా వుందా..?

హైదరాబాద్: సినిమా ర‌చ‌యిత‌గా, ద‌ర్శ‌కుడిగా పేరు పొందిన క‌త్తి మ‌హేష్ బిగ్ బాస్ సీజ‌న్ 1లో కంటెస్టెంట్‌గా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోతో పాపులారిటీ పొందిన క‌త్తి మ‌హేష్‌.. ప‌వన్ క‌ళ్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతో అనేక సార్లు వార్త‌ల‌లోకి ఎక్కాడు. అయితే కొద్దికాలంగా కామ్‌గా ఉంటున్న క‌త్తిమ‌హేష్‌కి క‌రోనా సోకింద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతుంది. దీనిపై స్పందించిన క‌త్తి త‌న‌కి కరోనా సోక‌లేద‌ని, త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేసే వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చరించాడు. క‌త్తి‌కి కరోనా వుందా..?ఫేస్‌బుక్‌లో క‌త్తి మ‌హేష్‌కి క‌రోనా సోకింద‌ని జోరుగా ప్ర‌చారం చేస్తుండ‌డంతో వెంటే స్పందించి పుకార్లకి అడ్డుక‌ట్ట వేశాడు. నేను ఇటీవ‌లే క‌రోనా టెస్ట్ చేసుకున్నాను. ఈ పరీక్షల్లో తనకు నెగిటివ్ వచ్చింది. ఆధారాలు లేకుండా కొంద‌రు కావాల‌నే నాపై తప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఇది మానుకోవాల‌ని హెచ్చ‌రించాడు క‌త్తి. క‌రోనా సోకిన నేను అధైర్య‌ప‌డే వ్య‌క్తిని కాదు. నా ఆరోగ్యంపై నాకు జాగ్ర‌త్త‌ ఉంది. నా హెల్త్ గురించి వాక‌బు చేసిన వారంద‌రికి ధ‌న్య‌వాదాలు అని పేర్కొన్నాడు క‌త్తి.