కాంగ్రెస్ సీనియర్ నేత వి.హెచ్ కు కరోనా పాజిటివ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్: తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో అపోలో హాస్పిటల్ కి వెళ్లిన ఆయన…కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. దీంతో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో వీహెచ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత గూడూరు నారాయణ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.