యోగాతో ఆరోగ్యం క్షేమం-ప్రభుత్వ చీఫ్ విప్

వరంగల్ అర్బన్ జిల్లా: యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా వుంటామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ బాలసముద్రంలోని క్యాంపు కార్యాలయంలో యోగ గురువు ప్రభు చైతన్య నేతృత్వంలో యోగ ఆసనాలు వేశారు. నియోజకవర్గ ప్రజలకు యోగాతో కలిగే ప్రయోజనాలను దాస్యం వినయ్ భాస్కర్ తెలియజేశారు. ప్రతీరోజు యోగ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.యోగాతో ఆరోగ్యం క్షేమం-ప్రభుత్వ చీఫ్ విప్