జయశంకర్ సార్ ఆశయాలను నెరవేరుస్తున్నాం : దాస్యం

వరంగల్ అర్బన్ జిల్లా: తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి కృషిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ యావత్ కాలం తెలంగాణ జాతి గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి అని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ , వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ 9వ వర్ధంతి సందర్భంగా హన్మకొండ బాలసముద్రం ఏకశిలా పార్క్ లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని, జయశంకర్ సార్ ఆశయాలను నెరవేరుస్తున్నాం : దాస్యంతెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కలిగే లాభాలను కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విడమరిచి చెప్పేవారన్నారని దాస్యం వినయ్ భాస్కర్ గుర్తుచేశారు. జయశంకర్ సార్ ఆలోచనలు టీఆర్‌ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రభుత్వానికి దిక్సూచి లాంటివన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా నాటి ఉద్యమ నేత , నేటి ముఖ్యమంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం కృషి చేస్తున్నారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.జయశంకర్ సార్ ఆశయాలను నెరవేరుస్తున్నాం : దాస్యంఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాషరావు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ కొడుకు,కోడలు మనుమడు, మనవరాలు పాల్గొన్నారు. జయశంకర్ సార్ కాంస్య విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.