కేజీఎఫ్ 2 తుఫాన్..సాంగ్ కు అమేజింగ్ రెస్సాన్స్

కేజీఎఫ్ 2 తుఫాన్..సాంగ్ కు అమేజింగ్ రెస్సాన్స్

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : రాకింగ్ స్టార్ య‌ష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మోస్ట్ అవెయిటెడ్ పాన్ ఇండియా మూవీకేజీఎఫ్ ఛాప్టర్ 2 (KGF Chapter2) . పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ, క్రేజీ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తోన్న ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కేజీఎఫ్ ఛాప్టర్ 1(KGF Chapter1) కు కొన‌సాగింపుగా రూపొందుతోన్న చిత్ర‌మిది. ఏప్రిల్ 14న తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుంది. మార్చి 27న సాయంత్రం 6 గంట‌ల 40 నిమిషాల‌కు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నారు.కేజీఎఫ్ 2 తుఫాన్..సాంగ్ కు అమేజింగ్ రెస్సాన్స్అధీర అనే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్ న‌టించారు. ర‌వీనాటాండ‌న్ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా రావు ర‌మేష్‌, ప్ర‌కాశ్ రాజ్ వంటి వారు ఇతర పాత్ర‌ల్లో మెప్పించ‌నున్నారు. భారీ అంచ‌నాల‌తో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోన్న కేజీఎఫ్ ఛాప్టర్ 2(KGF Chapter2) చిత్రం నుంచి సోమ‌వారం రోజున ‘తుఫాన్..’లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఐదు భాషల్లో విడులదైన ఈ సాంగ్‌కు ఆమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది.

దుర్మార్గుల చేతిలో చిదిమివేయబడుతున్న నరాచిలోని అమాయకులకు అండగా నిలిచిన రాకీ భాయ్ గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో ప్రారంభమయ్యే ఈ లిరిక‌ల్ వీడియో .. దానికి కొన‌సాగింపుగా వ‌చ్చే సాంగ్ వింటుంటే గూజ్ బ‌మ్స్ వ‌స్తున్నాయి. ర‌వి బస్రూర్ సంగీతం పాట‌లోని ఎమోష‌న్స్‌ను మ‌రో రేంజ్‌లో ఎలివేట్ చేస్తుంది. రాకీ భాయ్‌గా య‌ష్ వ‌సూళ్ల తుఫాన్‌ను ఎలా కొన‌సాగించ‌బోతున్నారోన‌ని ఆయ‌న ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు, ట్రేడ్ వ‌ర్గాలు ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నాయి.