కేంద్రీయ స్కూళ్లల్లో ఎంపీల కోటా తొలగింపు ?

కేంద్రీయ స్కూళ్లల్లో ఎంపీల కోటా తొలగింపు ?

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : కేంద్రీయ పాఠశాలల్లో ప్రవేశాలకు ఒక్కో విద్యాసంవత్సరంలో 10 మంది వరకు విద్యార్థులను సిఫారసు చేసేలా ఎంపీలకు కల్పించిన కోటాను తొలగించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. ఈ అంశంపై రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నది. సోమవారం లోక్ సభలో ఈ అంశం చర్చకు రావడంతో స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.కేంద్రీయ స్కూళ్లల్లో ఎంపీల కోటా తొలగింపు ?కేంద్రీయ పాఠశాలల్లో అడ్మిషన్లకు భారీగా విజ్ఞప్తులు వస్తుండటంతో ఎంపీలకు కల్పించిన 10 సీట్ల కోటా సరిపోవట్లేదని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ వెల్లడించారు. దీన్ని దృస్టిలో ఉంచుకుని ఎంపీల కోటా పెంచాలని, లేదంటే తొలగించాలని కోరారు. దీంతో కోటా తొలగింపునకు సభ ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఈ ప్రతిపాదనను చాలా మంది ఎంపీలు వ్యతిరేకించారు.