ఉక్రెయిన్ లో లివివ్ లో భారీ పేలుళ్లు 

ఉక్రెయిన్ లో లివివ్ లో భారీ పేలుళ్లు

వరంగల్ టైమ్స్, కీవ్ : ఉక్రెయిన్ లోని పశ్చిమ నగరం లివివ్ లో నేడు భారీ పేలుళ్లు జరిగాయి. మూడు ప్రదేశాల్లో పేలుళ్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఉదయం 6.30 నిమిషాలకు భారీ శబ్ధాలు వినిపించాయి. దానికి ముందు నగరంలో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. లివివ్ నగరంలో ఉన్న ఎయిర్ పోర్టును కూడా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ లో లివివ్ లో భారీ పేలుళ్లు దాడులతో దద్దరిల్లిన లివివ్ నగరం అంతా నల్లటి పొగతో కమ్ముకున్నది. మూడు వారాలు దాటిన యుద్ధంలో, ఇప్పటి వరకు రష్యా పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలను ఎక్కువగా టార్గెట్ చేయలేదు. అయితే గడిచిన ఆదివారం మాత్రం, పోలాండ్ బోర్డర్ వద్ద ఓ సిటీపై చేసిన అటాక్ లో 35 మంది చనిపోయిన విషయం తెలిసిందే.