జులై వరకు శ్రీవారికి ఏకాంతంగా ఆర్జిత సేవలు  

జులై వరకు శ్రీవారికి ఏకాంతంగా ఆర్జిత సేవలు

వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో స్వామి వారి ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. జూలై నెలాఖరు వరకు ఏకాంతంగానే ఆర్జిత సేవలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. కాగా కరోనా కేసులు తగ్గిపోవడంతో ఏప్రిల్ 1న శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ పునరుద్ధరించింది.జులై వరకు శ్రీవారికి ఏకాంతంగా ఆర్జిత సేవలు  అదే విధంగా సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం టికెట్ల సంఖ్యను పెంచింది. దీంతో వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 23 కంపార్ట్ మెంట్లలో వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. కాగా, శనివారం శ్రీవారిని 76,324 మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారని వెల్లడించారు.