కోహ్లికి కోటి దండాలు..పాక్ పై భారత్ విజయం

కోహ్లికి కోటి దండాలు..పాక్ పై భారత్ విజయం

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఒత్తిడిలో సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. వెల్ డన్ టీమిండియా.. కింగ్‌ కోహ్లి తనలోని చేజ్‌ మాస్టర్‌ను మరోసారి నిద్రలేపాడు. టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌లాంటి టీమ్‌పై సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. ఆశలన్నీ వదిలేసుకొని నిరాశగా టీవీలు ఆఫ్‌ చేసిన ఇండియన్‌ ఫ్యాన్స్‌ చివరికి ఒక రోజు ముందే దీపావళి జరుపుకునేలా చేశాడు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో అతడు ఆడిన అత్యద్భుత ఇన్నింగ్స్‌ తన కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ మ్యాచ్ అని చెప్పుకోవచ్చును.కోహ్లికి కోటి దండాలు..పాక్ పై భారత్ విజయంపాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. 6.1 ఓవర్లలో 31 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన జట్టుకు ఊహించిన రీతిలో విజయాన్ని అందించాడు. తొలి పది ఓవర్లలో 45 రన్స్ మాత్రమే చేసిన జట్టు 20 ఓవర్లలో 160 పరుగులు చేసిందంటే కోహ్లి వీరోచిత పోరాటమే కారణం. హార్దిక్ పాండ్యతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన కోహ్లి.. 12వ ఓవర్లో తొలి సిక్స్ బాదాడు. ఓ దశలో 34 బంతుల్లో 33 పరుగులతో వన్డే తరహాలో ఆడిన విరాట్.. మ్యాచ్ చివరికి వచ్చే సరికి ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు.

అశ్విన్ విన్నింగ్ షాట్ కొట్టగానే కోహ్లి భావోద్వేగానికి లోనయ్యాడు. విరాట్ కళ్లు కన్నీటితో చెమ్మగిల్లాయి. చేతులతో నేలపై పంచ్‌లు ఇస్తూ.. విరాట్ కోహ్లి సింహనాదం చేశాడు. రోహిత్ అయితే ఆనందంతో కోహ్లిని తన భుజాలపైకి ఎత్తుకున్నాడు.