శ్రీవారికి స్వర్ణ కంఠా భరణం కానుక

శ్రీవారికి స్వర్ణ కంఠా భరణం కానుక

శ్రీవారికి స్వర్ణ కంఠా భరణం కానుకవరంగల్ టైమ్స్, డివోషనల్ డెస్క్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల శ్రీదేవీ సమేత బంగారు కంఠాభరణాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి-స్వర్ణలత దంపతులు కానుకగా సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ కు ఈ ఆభరణం అందించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. విశ్వశాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠంలో ఈ నెల 12 నుంచి 18 వరకు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహాయాగం మహా పూర్ణాహుతితో విజయవతంగా ముగిసిందని వైవీ సుబ్బారెడ్డి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు.

కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దేశంపై కరోనా ప్రభావం ఉండకూడదని, ప్రపంచంలోని ప్రజలే కాకుండా సకల జీవులు ఆరోగ్యంగా ఉండాలని శ్రీ వేంటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తూ యాగం నిర్వహించామన్నారు. తిరుమలలో ఇప్పటి దాకా జరగని ఇలాంటి యాగం స్వామి వారి ఆశీస్సులతో తాము చేయించడం అదృష్టమని చెప్పారు. శ్రీ శ్రీనివాస మహా విశ్వ శాంతి యాగం విజయవంతంగా ముగిసినందువల్ల శ్రీవారికి కానుమ సమర్పించామన్నారు.