ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలుఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు

వరంగల్ టైమ్స్,వరంగల్ జిల్లా: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివస్తున్నారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈవో శేషు భారతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

మొదటి రోజు శ్రీ భద్రకాళి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో పోటెత్తారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు శేషు శర్మ ఆధ్వర్యంలో అర్చకులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు.