కేసీఆర్ ను కలిసిన పొన్నాల లక్ష్మయ్య
వరంగల్ టైమ్స్,హైదరాబాద్: సీనియర్ రాజకీయవేత్త,మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఊహించినట్లుగానే గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న పొన్నాల లక్ష్మయ్య ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి, తమ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే తాను ముందుగా బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ తో మాట్లాడాల్సి ఉందని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని పొన్నాల కేటీఆర్ కు తెలిపారు. చెప్పినట్లుగానే ఆదివారం పొన్నాల లక్ష్మయ్య దంపతులు ప్రగతి భవన్ కు చేరుకున్నారు. పొన్నాల దంపతులను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. వారితో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. పొన్నాలతో కాసేపు ముచ్చటించారు.నిన్న కేటీఆర్ ప్రతిపాదనకు పొన్నాల సానుకూలంగానే స్పందించారన్న నేపథ్యంలో రేపటి జనగామ సభలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకునే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రావు,దాసోజు శ్రవన్ కూడా పాల్గొన్నారు.