ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా 

ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ విజేతగా అర్జెంటీనా 

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : అర్జెంటీనా 36 యేండ్ల నిరీక్షణ సాకారమైంది. సూపర్ స్టార్ మెస్సీ స్వప్నం నెరవేరింది. అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఈ పోరులో అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. అర్జెంటీనా తరపున మెస్సీ రెండు గోల్స్ కొట్టగా, డిమారియా ఓ గోల్ సాధించాడు. ఫ్రాన్స్ తరపున స్టార్ ఆటగాడు ఎంబాపె సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కానీ మొత్తం మూడు గోల్స్ అతనే కొట్టినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. అర్జెంటీనా చివరిసారి 1986లో మారడోనా నేతృత్వంలో వరల్డ్ కప్ సాధించింది. మొత్తంగా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతమైంది.