సానియా,సోయబ్ డైవర్స్ పై పుకార్లు..నిజమేనా..!
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : భారత మాజీ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలోనే వీళ్లిద్దరు కలిసి ఈ మధ్య ఓటీటీలో ‘ది మీర్జా మాలిక్’ అనే రియాలిటీ టాక్ షోలో పాల్గొన్నారు కూడా. దీంతో అసలు వీళ్లు నిజంగానే విడాకులకు దరఖాస్తు చేశారా, లేదా అనే ప్రశ్న చాలామందిలో మొదలైంది. ఈ విషయంపై ఇటీవల షోయబ్ మాట్లాడుతూ, ‘అది మా వ్యక్తిగత విషయం. ఈ విషయాన్ని మాకు వదిలేయండి’… అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఈ స్టార్ జంట విడాకుల విషయంలో తాజాగా మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది.
సోయబ్ తన ఇన్ స్టా బయోలో ‘నేను సూపర్ వుమన్ సానియామీర్జాకు భర్తను’ అంటూ పేర్కొన్నాడు. ‘అథ్లెట్, సూపర్ వుమన్ సానియామీర్జాకు భర్త, ప్రేమకు ప్రతిరూపమైన ఒకరికి తండ్రిని’ అంటూ రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సోయబ్ బయోకు సంబంధించి పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. దాయాది దేశమైన పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహం 2010లో హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ జంటకు 2018లో కుమారుడు జన్మించాడు.