ప్రారంభమైన శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్

ప్రారంభమైన శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్

 

వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేకంగా ఈ కౌంటర్ ను ప్రారంభించింది. భక్తులు శ్రీవారికి విరాళంగా రూ.10వేల సమర్పించి దర్శన టికెట్ ను పొందే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది.

దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు టీటీడీ శ్రీవాణి దర్శనాన్ని గత కొన్ని నెలలుగా అమలు చేస్తోంది. ఇప్పటివరకు తిరుమలలో మాత్రమే మంజూరు చేస్తున్న ఈ శ్రీవాణి టికెట్స్ ను తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ అలాగే తిరుపతిలోని మాధవన్ గెస్ట్ హౌస్ లోనూ మంజూరు చేయనున్నారు.

ఒక్కొక్క టికెట్టు రూ. 10వేల విరాళం అందించడంతో పాటు అదనంగా మరో 500 రూపాయలు భక్తులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్ట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీవాణి దర్శన కౌంటర్ భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ రాజ్ కిషోర్ మీడియాకు తెలిపారు.