అరెస్ట్ కు దారితీసిన హద్దులు మీరిన ముద్దులు

అరెస్ట్ కు దారితీసిన హద్దులు మీరిన ముద్దులు

వరంగల్ టైమ్స్ కర్ణాటక : హద్దులు మీరి బైకుపై ముద్దులు పెట్టుకుంటూ ప్రయాణించిన ఓ యువకుడు కటకటాలు లెక్కబెడుతున్నాడు. ప్రియురాలితో బైక్ పై చక్కర్లు కొడుతున్న ఓ ప్రేమికుడు హద్దులు మీరాడు. బైక్ పై సరదాగా చక్కర్లు కొట్టడమే కాకుండా ప్రియురాలిలో ముద్దుల్లో ముంచెత్తాడు ఆ ప్రేమికుడు. ముద్దులు కాస్త హద్దులు మీరి, ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేని మైకంలో విహరిస్తున్న ఆ ప్రేమికుడికి పోలీసులు కళ్లు తెరిపించారు.అరెస్ట్ కు దారితీసిన హద్దులు మీరిన ముద్దులు ప్రియురాలితో ముద్దులు పెట్టుకుంటూ బైక్‌పై దూసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ వీర ప్రేమికున్ని చాజరాజనగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుండ్లుపేట–చాజరాజనగర మార్గంలో బైకు నంబర్‌ ఆధారంగా బైకిస్టు ఎస్‌సి స్వామిని అరెస్ట్‌ చేశారు. దీంతో నిర్లక్ష్యపు డ్రైవింగ్, న్యూసెన్స్‌ సెక్షన్ల కింద కేసు పెట్టారు.