స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్

వరంగల్ టైమ్స్, ఎన్టీఆర్‌ జిల్లా : ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో మైనర్‌ బాలికను వార్డు వాలంటీర్‌ భర్త లైంగికంగా వేధించాడు. ఇంటర్‌ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. శనివారం ఈ ఘటన జరగగా బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్తనను వేధించిన వాలంటీర్‌ భర్తకు శిక్ష పడాల్సిందేనని బాధితురాలు డిమాండ్‌ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్‌కు చెందిన బాలిక (17) తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం తిరువూరు ఎన్‌ఎస్‌పీ కాలనీలో కొన్నేళ్ల క్రితం స్థిరపడ్డారు. బాలిక ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. వరుసకు మామ అయిన వాలంటీర్‌ భర్త సురేష్‌ గత కొంత కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు.

ఇదే క్రమంలో బాలిక స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీశాడు. ఇది గమనించిన బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. వీడియోలను మొబైల్‌ నుంచి డిలీట్‌ చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సై సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ కేసు నమోదు చేసి.. అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్‌ భర్త సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.