ఏపీ సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ 

ఏపీ సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ

వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో నాటు సారాతో 27 మంది చనిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో వాస్తవాల వక్రీకరణకు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని లేఖలో పేర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా సహజ మరణాలుగా ప్రకటించడం దుర్మార్గమని పేర్కొన్నారు.ఏపీ సీఎంకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి లేఖ నాటు సారా మరణాలకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని, మృతుల కుటుంబాలపై ఒత్తిడి తెచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టాలని బాధితులపై ఒత్తిడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. జంగారెడ్డి గూడెంలో పర్యటించి బాధిత కుటుంబాలను ఓదార్చాలని జగన్ కు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని నారాయణ కోరారు.