ఎన్ఐటీలో కూలీలకు మద్దతుగా నిలిచిన చీఫ్ విప్

ఎన్ఐటీలో కూలీలకు మద్దతుగా నిలిచిన చీఫ్ విప్వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : నగరంలోని ఎన్ఐటీ హాస్టల్ లో పనిచేస్తున్న కూలీలకు మద్దతుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నిలిచాడు. ఎన్ఐటీ హాస్టల్ లో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న 65 మంది సాధారణ కూలీలను ఎన్ ఐటీ సిబ్బంది తీసివేయడంతో వారు ధర్నాకు దిగారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఎన్ఐటీకి వెళ్లారు. నిరసనకు దిగిన కూలీలకు మద్ధతుగా నిలిచాడు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పై అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలని చీఫ్ విప్ దాస్యం సూచించారు. దీంతో సమస్య సద్దుమనిగింది.