మేడారం తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన వీరబాబు తన కుటుంబసభ్యులతో కలిసి కారులో వచ్చి మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో మేడారం నుంచి హనుమకొండకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని జాకారం జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న భద్రమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది. కారులో ప్రయాణిస్తున్న మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు భద్రమ్మ మృతదేహాన్ని ములుగు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించారు.