ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి : చీఫ్ విప్ దాస్యం

ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి : చీఫ్ విప్ దాస్యంవరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఆడ రాక పాత గజ్జలు అన్నట్లుగా తెలంగాణకు నిధులు, ప్రాజెక్టులు ఇవ్వమని మేం అడుగుతుంటే తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా మోడీ మాట్లాడటం సిగ్గుచేటని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి : చీఫ్ విప్ దాస్యంరాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ చీఫ్ విప్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నల్ల కండువాలు కప్పుకుని, నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. బైక్ ర్యాలీలు నిర్వహించారు. చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ బ్లాక్ డ్రెస్ ధరించి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో హనుమకొండ నగరంలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి.ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలి : చీఫ్ విప్ దాస్యంహనుమకొండ నగరంలోని అదాలత్ జంక్షన్ లో అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. మోడీ వ్యాఖ్యలు తెలంగాణ అమరవీరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని చీఫ్ విప్ విమర్శించారు. తెలంగాణ వచ్చి ఏడేండ్లు దాటినా ప్రధాని మోడీ మాత్రం రాష్ట్రంపై సాడే సాత్ లా విషం చిమ్ముతూనే ఉన్నాడని దాస్యం దుయ్యబట్టాడు. విభజనను వక్రీకరించిన మోడీ వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ ఖచ్ఛితంగా తెలంగాణ ప్రజలకే కాదు దేశానిి క్షమాపణ చెప్పాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు.