కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కు ‘వై’ క్యాటగిరీ భద్రత 

కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కు ‘వై’ క్యాటగిరీ భద్రత

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : కశ్మీర్ పండిట్ల ఊచకోత, వలసలపై తీసిన చిత్రం కశ్మీర్ ఫైల్స్. ఈ సినిమా ఇప్పుడు ఇండియన్ మూవీ మార్కెట్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. ఇటీవల విడుదల ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. 1990లో కశ్మీర్ లో జరిగిన ఊచకోత ఆధారంగా సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రధాని మోడీ సైతం మెచ్చుకున్న ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా నేటితో వంద కోట్ల ఆదాయాన్ని దాటేసింది.కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కు 'వై' క్యాటగిరీ భద్రత అయితే వివాదాస్పదంగా మారిన ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన వివేక్ అగ్నిహోత్రికి ‘ వై ‘ క్యాటగిరీ భద్రతలను కల్పించారు. సీఆర్ఫీఎఫ్ జవాన్లతో భద్రత ఇస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు ఇప్పటికే పలు రాష్ట్రాలు పన్ను మినహాయింపు ప్రకటించారు. బీహార్ లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మార్చి 25న ఈ సినిమాను ఫ్రీగా స్క్రీనింగ్ చేయనున్నారు. ఈసినిమాను వీలైనంత మంది చూడాలని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం తార్ కిషోర్ ప్రసాద్ తెలిపారు. సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషిలు నటించారు.