కశ్మీర్ ఫైల్స్ పై మోడీకి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ 

కశ్మీర్ ఫైల్స్ పై మోడీకి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థయి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశానికి కావాల్సింది కశ్మీర్ ఫైల్స్ కాదు, డెవలప్మెంట్ ఫైల్స్ కావాలన్నారు. దేశంలో సమస్యలను పక్కదారి పట్టించడానికే ఈ సినిమాను విడుదల చేశారని మండిపడ్డారు.కశ్మీర్ ఫైల్స్ పై మోడీకి కౌంటర్ ఇచ్చిన కేసీఆర్ కేంద్రం కశ్మీర్ ఫైల్ సినిమాను వదిలిపెట్టి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కశ్మీర్ లో హిందూ పండిట్ లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా అని కేసీఆర్ ప్రశ్నించారు. రైతుల సమస్యలను పక్కదోవ పట్టించడానికే కశ్మీర్ ఫైల్ సినిమాను ముందుకు తెచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం అసలు విషయాలను పక్కనపెట్టి కశ్మీర్ ఫైల్స్ ని ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లించే దుర్మార్గం జరుగుతోందని కేసీఆర్ మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్, రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వర్ రావు కూడా హాజరయ్యారు.