ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్

ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్ ఇచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి బాధ్యతల్లో కోత విధించింది. ఆయనను కొన్ని బాధ్యతల నుంచి తప్పించింది టీపీసీసీ. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజక వర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి తప్పించింది.ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్ఆయనకు గతంలో ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ టీపీసీసీ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల్లో అంజన్, అజారుద్దీన్, మహేష్ గౌడ్ లకు అప్పగించారు. అలాగే భువనగిరి, ఖమ్మం, వరంగల్ భాద్యతలు అంజన్ కుమార్ యాదవ్ కి, కరీంనగర్ పార్లమెంట్ బాధ్యతలు మహేష్ గౌడ్ కి అప్పగించింది టీపీసీసీ.