మెగా జాబ్ మేళా..పోస్టర్ ఆవిష్కరించిన చీఫ్ విప్
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కోరారు. బుధవారం కాకతీయ యూనిర్సిటీలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. మార్చి 27న హంటర్ రోడ్డులోని వరంగల్ పబ్లిక్ స్కూల్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ మెగా జాబ్ మేళా పోస్టర్ ను దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ మేళాలో సుమారు 20 ప్రముఖ కంపెనీలు జియే, ఆదిత్య, ఇండిగో, తదితర కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు. విద్యా, వైద్యం, ఐటి పరిశ్రమలకు హబ్ గా మారిందని తెలిపారు. అందులో భాగంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ జాబ్ మేళా మార్చి 27న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సూచించారు.
వరంగల్ పశ్చిమ ప్రజల సౌకర్యార్థం వాక్ అండ్ టాక్ మీ ఎమ్మేల్యే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చీఫ్ విప్ తెలిపారు. రేపు ఉదయం నుండి రోజుకు ఒక్క ప్రాంతంలో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తామన్నారు. అంతేకాకుండా స్థానికులతో స్వయంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజల కోసం వారితో పాటు వాక్ చేస్తూ వారి సమస్యలు పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సాధ్యమైనంత వరకు వెంటనే పరిష్కరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహేష్, తదితరులు పాల్గొన్నారు.