ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

ఎంబీబీఎస్ కన్వీనర్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన ఖాళీల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 24న సాయంత్రం 6 గంటల నుంచి 26వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వెబ్ ఆపన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని వర్సిటీ పేర్కొంది. ఇప్పటికే యూనివర్సిటీ విడుదల చేసిన తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు ఈ విడత వెబ్ కౌన్సెలింగ్‌ లో పాల్గొనవచ్చని పేర్కొంది.

ఇతర వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. అయితే గత విడత కౌన్సెలింగ్‌ సీట్ అలాటై.. జాయిన్‌ కాకపోయినా, చేరి డిస్‌ కంటిన్యూ అయినా, ఆల్ ఇండియా కోటాలో ఇప్పటికే చేరిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులని స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఈ నెల 24 నుంచి 26 వ తేదీ వరకు వెబ్ కౌన్సెలింగ్‌ నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లకు ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌ పూర్త్తై విషయం తెలిసిందే.