తారక్ డెడ్ బాడీ తరలింపుపై ఫ్యాన్స్ అసంతృప్తి

తారక్ డెడ్ బాడీ తరలింపుపై ఫ్యాన్స్ అసంతృప్తి

తారక్ డెడ్ బాడీ తరలింపుపై ఫ్యాన్స్ అసంతృప్తివరంగల్ టైమ్స్, బెంగళూరు : బ్రెయిన్ డెడ్ కారణంగా నందమూరి తారకరత్న కన్నుమూసినట్లు సమాచారం. అత్యంత రహస్యంగా తారకరత్న పార్థివదేహాన్ని బ్యాక్‌ గేట్‌ ద్వారా తరలించినట్లు సమాచారం. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న నేడు తుదిశ్వాస విడిచాడు. బ్రెయిన్ డెడ్ కారణంగానే తారకరత్న చనిపోయినట్లు వైద్య బృందం భావిస్తున్నట్లు సమాచారం. విదేశీ వైద్యులతో వైద్యం అందించినప్పటికీ తారకరత్న విషయంలో వైద్యం ఫలించలేదు. తీరా తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం అటు కుటుంబసభ్యులను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

అయితే తారకరత్న మరణ వార్త తెలియడంతో అభిమానులు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి భారీగా తరలివచ్చారు. తమ అభిమాన నటుడిని కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. అయితే ఇది గమనించిన వైద్య బృందం అత్యంత రహస్యంగా తారకరత్న పార్థివదేహాన్ని బ్యాక్ గేట్ ద్వారా తరలించినట్లు సమాచారం. పైగా కర్ణాటక పోలీసులు బందోబస్తు మధ్య బెంగళూరు నుండి తారకరత్న పార్థివదేహం ఎస్కార్ట్ వాహనాలతో అంబులెన్స్ లో బయల్దేరింది. ఈ నేపథ్యంలో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించారు. ఆదివారం ఉదయం తారకరత్న పార్థివదేహం హైదరాబాద్ కి చేరే అవకాశం ఉంది.

అయితే తారకరత్న పార్థివదేహంను ఆస్పత్రి బ్యాక్ గేట్ ద్వారా అంబులెన్స్ లో తరలించడాన్ని అభిమానులు తప్పుబట్టారు. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసుకోకుండా చేశారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తారకరత్నని చూసేందుకు చాలా రోజులుగా ఇక్కడే ఉంటున్నామని, ఆయన్ని చూడాలని తపించామని, కానీ తమకు సమాచారం ఇవ్వకుండా, చూడనివ్వకుండా బ్యాక్‌ గేట్‌ ద్వారా తరలించడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకి తారకరత్న బాడీని చూపించాలని, చూపించేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ వాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.