రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు అని కొనియాడారు. లోక కల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైందని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైందని సీఎం పేర్కొన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీతారామచంద్రులను సీఎం కేసీఆర్ ప్రార్థించారు.