సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణంపై మార్గదర్శకాలు

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : బలహీన వర్గాలకు సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల సాయం చేయడానికి అవసరమైన విధివిధానాలు రూపొందించాలని గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ లో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 2022-23 బడ్జెట్ లో ఈ పథకానికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణంపై మార్గదర్శకాలుఈ పథకాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు రూపొందించి, సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించాలని స్పష్టం చేశారు. పూర్తైన డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్ధిదారులకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అమలులో ఉన్న 2BHK హౌసింగ్ పథకం ప్రగతిని కూడా ఈ సమావేశంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, ఎస్ ఈ బలరాం, ఓఎస్డీ రవీంద్రా రెడ్డి, మరియు 2BHK ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట్రామిరెడ్డి లు పాల్గొన్నారు.